KTR: తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సమావేశాలలో భాగంగా కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అనే విధంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇలా అధికార పక్షం ప్రతిపక్షం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ సమావేశాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి అయితే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, అమలు చేస్తామన్న సంక్షేమ పథకాలపై నిలదీసే హక్కు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఉందని కేటీఆర్ తెలిపారు మేము కనుక ఈ సభను ప్రోవోక్ చేయాలనుకుంటే చేయొచ్చు.. 30 శాతం కమీషన్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారు. 20 శాతం కమీషన్ అని సచివాలయంలో ధర్నాలు చేస్తున్నారు అని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ ఇలా మాట్లాడటంతో వెంటనే డిప్యూటీ సీఎం భట్టి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేటీఆర్ వళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలిపారు. అనంతరం స్పీకర్ కేటీఆర్ కు మాట్లాడే అవకాశం కల్పించడంతో కేటీఆర్ రేవంత్ రెడ్డి పై కూడా విమర్శలు చేశారు.2009 నుంచి కలిసి పనిచేస్తున్నాం. ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు నేను తొలిసారి ఎమ్మెల్యేగా వచ్చాను. ఆయనతో మాకు ఫ్రెండ్‌షిప్ ఉంది. గత 16 ఏండ్ల నుంచి ఆయనతో కలిసి పని చేస్తున్నాం.
భట్టి గారు అంటే మాకు చాలా గౌరవం ఆయన మాకు పెద్దన్నయ్యతో సమానమని తెలిపారు. ఆది శ్రీనివాస వ్యాఖ్యలను మాత్రం తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని మేము అనలేమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. దాని మీద చర్య తీసుకోండి అని రెవెన్యూ మినిస్టర్‌ను కోరాను. ఏకంగా రూ. 50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని కొనుక్కున్నారని కోమటిరెడ్డి అన్న మాటలను మేము అనలేమా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.