Radhe Shyam Release Date : బ్రేకింగ్ అప్డేట్ : మతిపోయే పోస్టర్ తో “రాధే శ్యామ్” కి ఫైనల్ డేట్ వచ్చేసింది.!

Radhe Shyam Release Date : గత రెండు రోజులు నుంచి టాలీవుడ్ లో మళ్ళీ పలు సినిమాలు తాలూకా రిలీజ్ డేట్ లు వస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాము. భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) నుంచి మొదలై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ “గని” వరకు కొత్త రిలీజ్ డేట్ లు ఇప్పుడు బయటకి వచ్చాయి. అయితే ఈ క్రమంలో ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వని సినిమా ఏదైనా ఉంది అంటే అది ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్” మాత్రమే.

ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు విడుదల చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా చిత్ర బృందం ఇప్పుడు ఒక ఫైనల్ క్లారిటీ ఇచ్చేసారు. ఈ చిత్రాన్ని ఈ వచ్చే మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక దీనిపై డిజైన్ చేసిన పోస్టర్ చూస్తే మతి పోతుంది అని చెప్పాలి. ఈ సినిమాలో ఒక భారీ షిప్ సీన్ ఉంటుందని ఇది వరకు చెప్పారు.

మరి అది ఏ రేంజ్ లో విజువల్స్ తో ఉంటుంది అనే దానికి రిలేటెడ్ గా ఈ కొత్త పోస్టర్ ని వదిలారు. ఇది చూస్తేనే భారీ అంచనాలు మరింత ఈ సినిమాపై నెలకొన్నాయి. ఇక ఈ భారీ సినిమాని రాధా కృష్ణ దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ వారు దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మాణం వహించారు.