బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి శశికళ విడుదలయ్యారు. జయలలిత మరణానంతరం అవినీతి కేసులో చిన్నమ్మ నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించారు. అయితే ఆమె అనారోగ్యం దృష్ట్యా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే ఈ విడుదలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు.బెంగళూరు పరప్పన జైలు నుంచి శశికళ రిలీజ్ కానున్నారు. ఈ మేరకు అధికారులు ఆమెకు అధికారిక పాత్రలను అందజేశారు.
ఇటీవల, శశికళకు కరోనా సోకడంతో ఆమెను జైలు సిబ్బంది ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన శశికళ విడుదలవుతున్నట్లుగా ఉన్న విడుదల పత్రాలను జైలు అధికారులు ఆసుపత్రిలో ఆమెకు అందించారు. ఇక ఇదే సమయంలో చెన్నైలో లలిత స్మారక మందిరాన్ని పళనిస్వామి, పన్నీల్ సెల్వం ఇద్దరు ఓపెన్ చేశారు. అయితే శశికళ విడుదల రోజే స్మారక మందిరం ప్రారంభం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక ఆమె తిరిగి పార్టీలోకి వచ్చినా సరే చేర్చుకునే లేదంటూ ఇప్పటికే పళనిస్వామి తేల్చిచెప్పారు. దీంతో ఆమె వచ్చాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అనే అంశం ఇప్పుడు తమిళనాట ఆసక్తికరంగా మారింది. ఆస్పత్రి వర్గాలతో చర్చించి డిశ్ఛార్జిపై నిర్ణయం తీసుకుంటామని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తెలిపారు. ప్రస్తుతం శశికళ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.