బ్రేకింగ్ : ఆర్ నారాయణ మూర్తి ఇంట విషాదం.. వారి తల్లి కన్నుమూత.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఎందరో స్టార్స్ ఉండొచ్చు కానీ కేవలం ప్రజల కోసం మాత్రమే సినిమాలు చేసి ఇప్పుడుకి కూడా ఆ ప్రజల్లో ఒకడిగా ఎలాంటి ఆడంబరాలు లేకుండా సర్వ సాధారణంగా గడిపేసే స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి అనే చెప్పాలి.

ఎన్నెన్నో విప్లవాత్మక సినెమాలులో నటించి దర్శకత్వం కూడా వహించి భారీ హిట్స్ కూడా అందుకున్నారు. ఇప్పుడుకి అయితే హైదరాబాద్ సినీ సర్కిల్స్ ప్రాంతాల్లో నార్మల్ గా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళిపోతూ కూడా కనిపిస్తారు. అంత సాధారణంగా ఆర్ నారాయణ మూర్తి కనిపిస్తారు.

మరి ఇప్పుడు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఆర్ నారాయణ మూర్తి తల్లి అయినటువంటి రెడ్డి చిట్టమ్మ ఆమె తన 93వ ఏట కన్ను మూసినట్టుగా వార్తలు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యాయి. మరి ఇంకా వివరాల్లోకి వెళ్లినట్టు అయితే..

రెడ్డి చిట్టమ్మ ఎప్పటి నుంచో రౌతులపూడి మండలం మల్లంపేట అనే గ్రామంలో నివసిస్తుండగా వయసుకు సంబంధించిన సమస్యలతో ఇప్పుడు ఆమె కన్ను మూసినట్టుగా తెలిసింది. దీనితో ఆర్ నారాయణ మూర్తి ఇంట విషాద ఛాయలు అలుముకోగా సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.