బ్రేకింగ్ : బాబుకి అండగా నారా రోహిత్ సంచలన ప్రెస్ నోట్..!

నిన్న మీడియా సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కన్నీరు మున్నీరు అయ్యిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఘటన పెను సంచలనంగా కూడా మారింది. పవన్ కళ్యాణ్ నుంచి మరింత మంది సినీ ప్రముఖులు బాబు పై వైసీపీ నేతలు చేసిన దారుణ కామెంట్స్ ని ఖండించారు. మరి ఇదిలా ఉండగా నారా వారి కుటుంబం నుంచి హీరోగా పరిచయం అయ్యిన వారిలో ఒకడైన నారా రోహిత్ సంచలన ప్రెస్ నోట్ ని రిలీజ్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. ప్రతి విషయాన్ని టచ్ చేస్తూ రోహిత్ ఈ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసాడు. ఇంతకీ అందులో మేటర్ ఏమిటంటే..

“ఉన్నత విలువలతో ప్రజాసమస్యలపై అర్ధవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో నిన్న కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబునాయుడుగారిని, వారి సతీమణి భువనేశ్వరిగారిని అసభ్యపదజాలంతో దూషించడం దిగ్భ్రాంతికరం. రాజకీయ విమర్శలు విధానాలపై వుండాలి కానీ కుటుంబసభ్యులను అందులోకి లాగి అసభ్యంగా మాట్లాడడం క్షమార్హం కాదు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కును దుర్వినియోగం చేసి నోటికొచ్చినట్టు మాట్లాడడం తగదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చంద్రబాబు గారి నైతిక సైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది మీ భ్రమే అవుతుంది. ఆయన అధికారంలో వున్నప్పుడు ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి వుండడం వల్లే మీ మనుగడ సాగింది. ఇప్పటికీ వాటికి కట్టుబడి వుండడం వల్లే సంయమనంతో వున్నాం. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్టు నిన్నటితో మీ వంద తప్పులు పూర్తయ్యాయి. ఇక మీ అరాచకాన్ని ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికుడు వైసిపి దుశ్శాసనుల భరతం పడతారు. ఈ వికృత క్రీడలను వెనకుండి ఆడిస్తున్న వారు కూడా కాలం ఎప్పుడూ ఒకేలా వుండదని గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి స్థాయి లేని వ్యక్తుల మధ్యలో మీరు రాజకీయం చేయాల్సి రావటం దురదృష్టకరం పెదనాన్న, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమంతా మీ వెంటే వుంటాం.” అని రోహిత్ పొందుపరిచాడు. మరి ఈ వివాదం ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి.