Bramhanandam: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కమెడియన్ అంటే అందరికీ టక్కున బ్రహ్మానందం గుర్తుకు వస్తారు. బ్రహ్మానందం ఎన్నో వందల సినిమాలను తన కామెడీ ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇప్పటికీ కూడా ఈయన పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే బ్రహ్మానందం తన కుమారుడు గౌతమ్ తో కలిసి నటించిన బ్రహ్మ ఆనందం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఈ సినిమా నుంచి టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందంతో పాటు ఇతర చిత్ర బృందం కూడా పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు చాలామంది నాకు సినిమా అవకాశాలు లేక నేను సినిమాలలో నటించడం లేదని చెబుతూ ఉన్నారు. వాస్తవం అది కాదని తెలిపారు. నాకు ఇప్పటికీ కూడా ఎన్నో సినిమా అవకాశాలు వస్తున్నాయి అయినప్పటికీ కూడా నేను సినిమాలలో నటించలేదని తెలిపారు.
ఇలా తాను సినిమాలను పూర్తిగా తగ్గించడానికి గల కారణం నా వయసు సహకరించకపోవటమేనని తెలిపారు. ఒకప్పుడు నేను వరుస సినిమాలలో నటిస్తూ చాలా యాక్టివ్ గా ఉండేవాడిని కానీ ఇప్పుడు తనకు వయసు పై పడటంతో నటించలేనని మన వయసుకు తగ్గట్టు మనం వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న పదాలు మెడలో తగిలించుకోవడానికే పనికి వస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలని తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం వెన్నెల కిషోర్ గురించి కూడా మాట్లాడారు. కిషోర్ చాలా టాలెంటెడ్ యాక్టర్ అని, సినిమాలోని కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు అతని టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్ కి మధ్యలోనే నవ్వొచ్చేదని ఆ టాలెంట్ అందరిలో ఉండదని బ్రహ్మానందం తెలిపారు. నా తర్వాత నా లెగసీని ఎవరైనా కంటిన్యూ చేస్తారా అంటే అది కేవలం వెన్నెల కిషోర్ వల్లే సాధ్యమవుతుంది అంటూ బ్రహ్మానందం చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.