“బ్రహ్మాస్త్రం” ట్రైలర్ : ఇండియన్ సినిమా నుంచి హాలీవుడ్ స్థాయి ట్రీట్.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర చాలా వరకు మన తెలుగు అలాగే సౌత్ ఇండియన్ సినిమాల డామినేషన్ బాగా కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో హిందీ సినిమాల పని అయ్యిపోయింది అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు కానీ నిజమైన మూవీ లవర్ అయితే ఏ భాషకి చెందిన వాడు అయినా అన్ని భాషల సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటాడు. 

అలా ఇప్పుడు హిందీ నుంచి పాన్ ఇండియా లెవెల్ హిట్ కావాల్సి ఉంది. అయితే ఇది మాత్రం ఇప్పుడు రాబోతున్న భారీ చిత్రం “బ్రహ్మాస్త్ర” తోనే సాధ్యం అయ్యేలా ఉందనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో “బ్రహ్మాస్త్రం” అనే టైటిల్ తో రిలీజ్ అవుతుంది. 

అయితే ఈ సినిమా ట్రైలర్ అయితే మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు.. ఇది చూసాక ఈ సినిమా మాత్రం ఇప్పటి వరకు వచ్చిన గ్రాఫికల్ చిత్రాల్లో ది బెస్ట్ గా నిలుస్తుంది అని చెప్పాలి సినిమాలో ప్రతి విజువల్ కూడా అంత సహజంగా మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. మన దేశపు ఇతిహాసం సృష్టిలో మూలాలు వాటి పవర్స్ కాన్సెప్ట్ పై ఓ హాలీవుడ్ రేంజ్ సినిమాలా కనిపిస్తుంది. 

ఇంకా మెగాస్టార్ వాయిస్ ఓవర్ అయితే తెలుగుకి చాలా ప్లస్ అయ్యింది అని చెప్పాలి. అలాగే కింగ్ నాగార్జున రోల్ కూడా ఈ సినిమాలో సాలీడ్ గా కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమా డెఫినెట్ గా హాలీవుడ్ లెవెల్ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తుంది. అది తెలియాలి అంటే ఈ సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. 
BRAHMĀSTRA OFFICIAL TRAILER | Telugu| Amitabh | Nagarjuna | Ranbir & SS Rajamouli |In Cinemas Sept 9