Boycott HHVM: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు వేదికలు రాజకీయ సభలగా మారుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు రాజకీయాలలో కొనసాగుతున్నారు అయితే సినిమా వేదిక పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం మాట్లాడాలి అనే విచక్షణ కూడా కోల్పోతూ రాజకీయ అంశాలకు తెర లేపుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయాల గురించి మాట్లాడటంతో ఆ సినిమాలపై కోలుకోలేని దెబ్బ పడింది.
ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో శిల్పకళ వేదికలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు మంత్రులు హాజరై సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా యధావిధిగా మళ్లీ రాజకీయాల గురించి ప్రస్తావన రావడంతో వైసిపి అభిమానులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లు కేవలం పది రూపాయలకు మాత్రమే అమ్మారు అంటూ మాట్లాడారు అలాగే రఘురామకృష్ణం రాజు వంటి తదితరులు రాజకీయాల గురించి మాట్లాడిన నేపథ్యంలో వైసిపి అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమాని బాయికాట్ చేయాలి అంటూ ఒక హ్యాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
సినిమా వాళ్ళు ఇంకా మారారా ??#HariHaraVeeraMallu ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి రాజకీయ విమర్శలు !!#BoycottHHVM అని పిలుపు ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా సైన్యం ….సిగ్గు ఉన్న వైసీపీ అభిమాని ఎవడు ఈ సినిమా చూడడు అని శపధం !! pic.twitter.com/qAJzYhjj6f
— cinee worldd (@Cinee_Worldd) July 21, 2025
#BoycottHHVM అని పిలుపు ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా సైన్యం ….సిగ్గు ఉన్న వైసీపీ అభిమాని ఎవడు ఈ సినిమా చూడడు అని శపధం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ పోస్టుల పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు గట్టిగానే కౌంటర్ ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి మరోసారి సోషల్ మీడియాలో వైసీపీ వర్సెస్ జనసేన అనే విధంగా వివాదాలు కూడా జరుగుతున్నాయని చెప్పాలి.
