Balayya-Boyapati: బాలకృష్ణ కోసం ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్న బోయపాటి.. అబ్బా ఏమన్నా ప్లాన్ చేశాడా!

Balayya-Boyapati: టాలీవుడ్ నందమూరి హీరో బాలయ్య బాబు ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నారు. సీనియర్ హీరో అయినా బాలకృష్ణ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తూ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందుకుంటున్నారు. ఇప్పటికీ గత నాలుగు సినిమాలతో ఒకదాని తర్వాత ఒకటి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. మరియు సీనియర్ హీరో సాధించిన ఘనతను కూడా సాధించారు. ఇప్పటికే బాలయ్య బాబు డబుల్ హ్యాట్రిక్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ప్లాన్ తో వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు బాలకృష్ణ కోసం బోయపాటి తన సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే హ్యాట్రిక్ హిట్టు కొట్టి డబుల్ హ్యాట్రిక్ వైపు దూసుకుపోతున్నాడు బాలకృష్ణ. గతంలో వరుసగా ప్లాప్ సినిమాలు చూసిన బాలయ్య. అఖండ సినిమా.నుంచి మంచి ఫామ్ లోకి వచ్చాడు. వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బ్లాస్ట్ అయ్యాయి. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూమహరాజ్ ఇలా నాలుగు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ 2 సినిమా షూటింగ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను అంతకు మించి అనేలా ప్లాన్ చేశాడట బోయపాటి. వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకూ వచ్చిన సినిమా ఏది ప్లాప్ అవ్వలేదు.

సో అఖండ2 పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి రోజుకి ఒక న్యూస్ బయటకు వస్తోంది. ఇక ఈమూవీలో తన సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్నాడట బోయపాటి. బోయపాటి సినిమా ద్వారా హీరోగా ఉన్న ఆది పినిశెట్టిని పవర్ ఫుల్ విలన్ గా చూపించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో ఆది రోల్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో కూడా అందరికి తెలుసు. సో ఆది విలన్ గా కలిసి వచ్చాడు కాబట్టి. ఆ సెంటిమెంట్ ను అఖండ2 కోసం ఉపయోగించబోతున్నాడట బోయపాటి. బాలయ్య సినిమాలో ఆది పినిశెట్టి దాదాపు కన్ ఫార్మ్ అయినట్టే అంటున్నారు. ఈ విషయం గురించి అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ సినిమా విషయంలో బోయపాటి అనుకున్నది జరుగుతుందా? ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.