Hero Ram: బోయపాటి రామ్ పోతినేని క్రేజీ కాంబో సెట్టయినట్టే…. అధికారకంగా వెల్లడించిన చిత్రబృందం!

Hero Ram: బోయపాటి శ్రీను అనగానే మాస్ సినిమాకు ఫాదర్ అలాంటి డైరెక్టర్ తో ఫుల్ హౌస్ ఎనర్జీ లాంటి ఇస్మార్ట్ హీరో రామ్ సినిమా చేయబోతున్నాడంటే మాస్ రామ్ ఫ్యాన్స్ కే కాదు మాస్ ఆడియన్స్ అందరికి పండగే. ఇక వివరాల్లోకి వెళితే రామ్ తన 20సినిమాగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా ను ఓకే చేసారు. ఏ సినిమా ను శ్రీను చిట్టూరి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించనున్నారు.

రామ్ ప్రస్తుతం ది వారియర్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ లింగస్వామి డైరెక్టర్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఏ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ సరసన ఉప్పెన ఫేమ్ కీర్తిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఆది పినిశెట్టి కీలక పాత్రలో కన్పించనున్నారు. ఇంకా నదియా, అక్షర గౌడ, భారతీరాజా, రెడీన్ కింగ్స్లేయ్ ఈ సినిమాలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కు మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు తమిళ్ భాషలలో విడుదలకు ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

ఇక బోయపాటి అఖండ సక్సెస్ తో టాలీవుడ్ కు అలాగే థియేటర్స్ కు కోవిడ్-19 లాక్ డౌన్ తర్వాత కొత్త ఊపు ఇచ్చారు. అఖండ గ్రాండ్ సక్సెస్ తర్వాత బోయపాటి నెక్స్ట్ చిత్రంగా రామ్ 20రానుంది. పాన్ ఇండియా మూవీ గా బహు భాషల్లో ఈ మూవీ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీ అప్డేట్ ను ట్వీటర్ ద్వారా బోయపాటి శ్రీను రామ్ పోతినేని, అలాగే ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి తెలిపారు. బోయపాటి తన పోస్ట్ లో ఎన్నో రోజులు గా రామ్ తో సినిమా తీయాలనుకున్న ఇప్పుడు సెట్ అయిందని వ్రాసారు అలాగే రామ్ తన ట్వీటర్ లో మాస్ డాడీ బోయపాటి తో వర్క్ చేయడానికి చాలా హ్యాపీ గా ఉందని వ్రాసారు.