బాక్సాఫీస్ : జపాన్ లో “RRR” వసూళ్లు లెక్కలు ఎలా ఉన్నాయంటే..!

RRR

ఈ ఏడాది పాన్ ఇండియా మార్కెట్ లో భారీ వసూళ్లతో రికార్డులు తిరగేసిన చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీ తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా ఇది.

మరి ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్లే అందుకుంది. దీనికి మించి పాన్ వరల్డ్ లెవెల్లో భారీ రీచ్ కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా అయితే జాపనీస్ భాషలో డబ్ చేసి మేకర్స్ రిలీజ్ చేయగా దానికి ముందు అక్కడికి వెళ్లిన మేకర్స్ కి భారీ వెల్కమ్ ని చిత్ర యూనిట్ అందుకున్నారు.

ఇక ఈ చిత్రం జపాన్ లో వసూళ్లు చూసినట్టు అయితే ఈ చిత్రం అక్కడ మొదటి మూడు రోజుల వసూళ్లు చూసినట్టు అయితే అక్కడి కరెన్సీ లో అయితే 65 మిలియన్ యిన్స్ ఈ చిత్రం వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు.

దీనితో అయితే మన దేశపు కరెన్సీ ప్రకారం 4 కోట్ల గ్రాస్ వసూలు చేయగా 2 కోట్ల షేర్ ని ఈ చిత్రం అక్కడ అందుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈ వసూళ్లు అక్కడ రీసెంట్ అనే చెప్పాలి. కానీ అనూహ్యంగా అంత భారీ ఓపెనింగ్స్ అయితే కాదు. మరి ఫైనల్ రన్ లో జపాన్ లో ఈ చిత్రం ఏ సినిమాని క్రాస్ చేస్తుందో అనేది చూడాలి.