బాక్సాఫీస్ రిపోర్ట్ : వరల్డ్ వైడ్ డే 1 దుమ్ము లేపిన “యశోద” వసూళ్లు.!

అక్కినేని మాజీ కోడలు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా హీరోయిన్ గా కాకుండా మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ అవైటెడ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం “యశోద”. పలు కష్టాలతోనే చిత్ర బృందం ఈ సినిమాని ముగించగా ఫైనల్ గా థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రంతో సమంత రియల్ కం బ్యాక్ ఇచ్చింది అని చెప్పొచ్చు.

అప్పుడు మజిలీ తర్వాత చేసిన జాను డిజాస్టర్ కాగా ఇప్పుడు ఈ సినిమాతో సమంత మాస్ కం బ్యాక్ అయితే ఈ సినిమాతో ఇచ్చింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రం అయితే మొదటి రోజు వరల్డ్ వైడ్ అదిరే వసూళ్లు నమోదు చేసినట్టుగా చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేశారు.

మరి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అంటే వరల్డ్ వైడ్ గా 6.32 కోట్ల గ్రాస్ ని అయితే వసూలు చేసిందట. మరి ఇందులో మన తెలుగు రాష్ట్రాల నుంచే 4 నుంచి 5 కోట్ల మేర గ్రాస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇతర భాషల్లో కూడా మంచి నంబర్స్ నే అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు మరింత మెరుగైన వసూళ్లు రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు.

అలాగే యూఎస్ లో కూడా ఈ చిత్రం మొదటి రోజుకి 1.61 కోట్ల గ్రాస్ ని రాబట్టేసి సత్తా చాటింది. దీనితో అయితే సమంత మాత్రం మళ్ళీ గట్టి హిట్ నే కొట్టేసింది అని చెప్పి తీరాలి. ఇంకా ఈ సినిమాని అయితే దర్శకులు హరి, హరీష్ తెరకెక్కించారు. శ్రీదేవి మూవీస్ వారు నిర్మించారు.