బాక్సాఫీస్ : 4 రోజుల్లో “కాంతారా” తెలుగు వసూళ్లు ఎంతంటే..!

లేటెస్ట్ గా తెలుగు సహా పాన్ ఇండియన్ సినిమా దగ్గర మంచి హాట్ టాపిక్ గా మారిన హిట్ చిత్రం “కాంతారా”. శాండిల్ వుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిత్రం కన్నడలో ఏకంగా 100 కోట్ల గ్రాసర్ గా నిలవడమే కాకుండా తెలుగు సహా హిందీలో కూడా భారీ వసూళ్లు నమోదు చేస్తుండడం విశేషంగా మారింది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం తెలుగు వసూళ్లకు సంబంధించి వివరాలు తెలుస్తున్నాయి. మేకర్స్ ఇప్పుడు అధికారికంగా చెప్తున్నా దాని ప్రకారం అయితే ఈ చిత్రం నిన్న మంగళవారం వసూళ్లతో 20 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

మరి ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వారు కేవలం 2 కోట్లు మాత్రమే పెట్టి కొనుగోలు చేయగా ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే 20 కోట్ల వసూళ్లు అందుకుంది. మరి సోమవారం అయితే ఈ చిత్రం 5 కోట్ల గ్రాస్ అందుకోగా నిన్న మంగళవారం 3.6 కోట్లు అందుకుందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

దీనితో కాంతారా తెలుగులో సునాయాసంగా 30 కోట్ల మార్క్ ని దాటుతుంది అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇంకా ఈ సినిమాలో అయితే గరుడ వాహన గమన ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా నటించగా తానే ఈ సినిమాని దర్శకత్వం వహించాడు. అలాగే విక్రాంత్ రోనా ఫేమ్ అగ్నీస్ లోకనాథ్ సంగీతం అందించాడు.