బాక్సాఫీస్ : తెలుగులో “కాంతారా” ఫస్ట్ వీక్ వసూళ్లు.!

తాజాగా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ గా వచ్చిన చిత్రాల్లో కన్నడ భాష నుంచి వచ్చిన మరో ఆణిముత్యం లాంటి చిత్రం “కాంతారా” కూడా ఒకటి. దర్శక హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన నటించిన ఈ చిత్రం డివోషనల్ గా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. మరి కన్నడ లో మొదట రిలీజ్ అయ్యినా నెక్స్ట్ తెలుగులో రిలీజ్ కాబడిన ఈ చిత్రం తెలుగులో కూడా భారీ వసూళ్లు అందుకుంటూ భారీ లాభాలు తెచ్చి పెట్టింది.

మరి తెలుగులో అయితే ఈ శుక్రవారం పూర్తి చేసుకోవడంతో మొత్తం 7 రోజుల థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసింది. ఇక ఈ వారంలో అయితే ఈ చిత్రం టోటల్ గా 11.4 కోట్ల షేర్ ని అలాగే 22 కోట్లకి పైగా గ్రాస్ ని కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చిత్రం అందుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఈ చిత్రం అయితే సరిగ్గా ఏడవ రోజు 65 లక్షల షేర్ ని అందుకుందట. అలాగే యూఎస్ మార్కెట్ లో అయితే 1 మిలియన్ డాలర్ మార్క్ దిశగా ఈ సినిమా దూసుకెళ్తుంది. పైగా కొత్త రిలీజ్ లు ఉన్నా కూడా ఈ సినిమా ఇంత రాబట్టడం ఆశ్చర్యకరం అని ట్రేడ్ విశ్లేషకులు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి అయితే కాంతారా తెలుగులో మరింత మంచి వసూళ్లు అందుకునే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇప్పుడు మరో వీకెండ్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా మరింత మంచి వసూళ్లు అయితే వస్తాయి.