RRR Movie : బాక్సాఫీస్ రిపోర్ట్ : తెలుగు స్టేట్స్ లో “RRR” వసూళ్ల వివరాలు ఎలా ఉన్నాయంటే.?

RRR Movie :  భారీ అంచనాలు నడుమ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి ట్రిపుల్ ఆర్(RRR) ప్రపంచ వ్యాప్తంగా మొన్న మార్చ్ 25న రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యింది. అన్ని చోట్లా కూడా ఈ చిత్రం సూపర్ పాజిటివ్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర మాత్రం విడుదల అయ్యిన అన్ని చోట్ల కూడా రికార్డులే నమోదు అయ్యాయి.
మరి ఈ చిత్రానికి సంబంధించి రెండు రోజులకి గాను ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. మొదటి రోజే ఏపీ మరియు తెలంగాణాలో 100 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా స్ట్రాంగ్ కలెక్షన్ కొల్లగొట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నైజాం – 38.40 కోట్లు, సీడెడ్ – 22.60 కోట్లు, ఉత్తరాంధ్ర – 11.05 కోట్లు, నెల్లూరు – 3.86 కోట్లు, గుంటూరు – 9.51 కోట్లు, కృష్ణ – 6.02 కోట్లు, తూర్పు గోదావరి – 6.97 కోట్లు, వెస్ట్ గోదావరి – 6.89 కోట్లు వసూలు చేసింది. దీనితో రెండు రోజులకి గాను ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల కి పైగా షేర్ మార్క్ ని దాటేసి కేవలం రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ ని అందుకున్న మొదటి సినిమాగా నిలిచింది.
అలాగే ఓవర్సీస్ లో అయితే 7.5 మిలియన్ యూఎస్ బాక్సాఫీస్ దగ్గర అందుకున్నట్టు తెలుస్తుంది. వీటిపై మరియు హిందీలో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.