Radhe Shyam : బాక్సాఫీస్ రిపోర్ట్ : 3 దేశాల్లో “రాధే శ్యామ్” ఫస్ట్ డే కలెక్షన్ వివరాలు.!

Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మరియు మోస్ట్ అవైటెడ్ భారీ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్”. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ భారీ సినిమా నిన్ననే ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. అయితే అనూహ్యంగా లాస్ట్ మినిట్ లో ఈ సినిమా ఎందుకో అనుకున్న స్థాయి రిలీజ్ కాలేదు కానీ వసూళ్ల పరంగా కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించింది అని చెప్పాలి.

అయితే తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్ లో మాత్రం రాధే శ్యామ్ అదరగొట్టినట్టు తెలుస్తుంది. ముందుగా ఓవర్సీస్ కి సంబంధించి రాధే శ్యామ్ తాలూకా ప్రీమియర్స్ మరియు ప్రీ సేల్స్ ఫస్ట్ డే కలెక్షన్ వివరాలు చూసినట్టు అయితే మొదటగా బిగ్గెస్ట్ మార్కెట్ యూఎస్ ఏ బాక్సాఫీస్ దగ్గర రాధే శ్యామ్ టోటల్ గా ఫస్ట్ డే నాటికి అన్ని భాషల్లో కలిపి 9 లక్షల 4 వేల డాలర్స్ ను అందుకుందట అంటే దాదాపు 6.93 కోట్లు ఈ చిత్రం అందుకుంది.

ఇది ప్రీమియర్స్ కాగా మొదటి రోజు అయితే 3 లక్షల 65వేల డాలర్స్ ని అందుకుందట. అంటే మొత్తం కలిపి 1.269 మిలియన్ మార్క్ ని అందుకుంది. మన కరెన్సీ లో అయితే 9.74 కోట్ల రూపాయలని రాధే శ్యామ్ అందుకుంది. ఇది భారీ ఫిగర్ అని చెప్పాలి. అలాగే ఆస్ట్రేలియా లో కూడా రాధే శ్యామ్ మంచి హోల్డ్ తోనే స్టార్ట్ అయ్యిందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

అక్కడ ఈ సినిమాకి గాను 2 లక్షల వెయ్యి డాలర్స్ కి పైగా రాబట్టిందట అంటే మొదటి రోజు అక్కడ 1.13 కోట్లు అందుకుంది.. అలాగే న్యూజిలాండ్ లో అయితే ఈ చిత్రం యూఎస్ డాలర్స్ ప్రకారం 10 వేల డాలర్స్ ని అందుకుందట అంటే 76 లక్షల 75 వేల రూపాయలకి పైగా గ్రాస్ ని ఈ చిత్రం అందుకుంది. ఇలా మొదటి రోజు నాటికి ఈ మూడు దేశాల్లో రాధే శ్యామ్ మంచి నంబర్స్ ని నమోదు చేసింది.