Radhe Shyam : బాక్సాఫీస్ రిపోర్ట్ : “రాధే శ్యామ్” వరల్డ్ వైడ్ డే 1 వసూళ్ల డీటైల్స్..హిందీలో దారుణం.!

Radhe Shyam :  ఎన్నో అంచనాలు నడుమ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్” నిన్ననే ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. అయితే ఎందుకో లాస్ట్ మినిట్ లో ఈ చిత్రం అనుకున్న స్థాయి హైప్ ని ఇండియా వైడ్ అందుకోలేకపోయింది.
కానీ తెలుగు స్టేట్స్ లో మాత్రం ప్రభాస్ తన స్టార్డం కి తగ్గట్టుగా అదరగొట్టేసాడు. అయితే ఇప్పుడు ఈ అవైటెడ్ సినిమా కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల తాలూకా ఫస్ట్ డే వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. మరి ఈ వసూళ్ల వివరాలు చూసినట్టు అయితే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ స్థాయిలో 37.8 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇది ఒక స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పాలి. అలాగే కర్ణాటకలో 5 కోట్లు రాబట్టింది. అలాగే హిందీ బెల్ట్ తో కలిపి భారతదేశ వ్యాప్త వసూళ్లు అయితే దాదాపు 10.36 కోట్ల మేర టచ్ చేసిందట.
దీనితో ఇంకో పక్క ఓవర్సీస్ వసూళ్లు కూడా మంచి స్ట్రాంగ్ గానే వచ్చాయి. ఇక్కడ నుంచి 19.17 కోట్లు రాగా టోటల్ గా రాధే శ్యామ్ ప్రపంచ వ్యాప్తంగా 72.33 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం అందుకుంది. అయితే ప్రభాస్ కెరీర్ లో ఒక మంచి నెంబర్ అని చెప్పాలి కానీ హిందీ లో మాత్రం తన మార్కెట్ ఏ రేంజ్ లో పడిందో చూడాలి.
అక్కడ ఫస్ట్ డే ఆశ్చర్యకరంగా కేవలం 4.65 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చిందట. ఇది ఒక షాకింగ్ నెంబర్ అని చెప్పాలి. మొత్తానికి అయితే రాధే శ్యామ్ ఫస్ట్ డే వసూళ్లు డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. సినిమాకి ఆల్రెడీ 200 కోట్ల మేర టార్గెట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ డే గ్రాస్ 72 కోట్లకి పైగా వచ్చింది. షేర్ ఏమో 40 కోట్ల మేర వచ్చిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి ఆ మొత్తం టార్గెట్ ని అందుకుంటుందో లేదో చూడాలి.