RS 2 Days collections : బాక్సాఫీస్ రిపోర్ట్ : “రాధే శ్యామ్” 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ వివరాలు ఇవే.!

RS 2 Days collections : మళ్ళీ చాలా కాలం తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” రిలీజ్ అయ్యి భారీ ఓపెనింగ్స్ ని అందుకుంది. అయితే ప్రభాస్ స్టార్డం కి తగ్గ భారీ స్థాయి వసూళ్లు ఈ సినిమాకి రాలేదు కానీ చిత్ర యూనిట్ మాత్రం రెండు రోజులకి గాను భారీ నంబర్స్ నే ప్రచారం చేస్తున్నారు.
వారు చెప్పిన దాని ప్రకారం అయితే రెండు రోజుల్లో భారీ స్థాయిలో 119 కోట్లు గ్రాస్ ఈ సినిమా చేయగా గ్రౌండ్ టాక్ లో ట్రేడ్ వర్గాలు మాత్రం వేరే రిపోర్ట్స్ చెబుతున్నారు. వీటి ప్రకారం అయితే ఈ చిత్రం రెండు రోజులు ప్రపంచ వ్యాప్త వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
మొదటగా ఏపీ మరియు తెలంగాణా లో వసూళ్లు చూసినట్టు అయితే 59 కోట్ల కి పైగా గ్రాస్ ని వసూలు చేయగా 38 కోట్ల షేర్ అని అందుకుందట. అలాగే హిందీ సహా తమిళ్ మరియు కన్నడ రెస్టాఫ్ ఇండియాలో ఈ సినిమా 11.9 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది.
ఇక ఫైనల్ గా ఓవర్సీస్ మార్కెట్ లో చూసినట్టు అయితే ఫస్ట్ డే కె మంచి నెంబర్ ని రాధే శ్యామ్ నమోదు చేసింది. తర్వాత కూడా మంచి వసూళ్లనే అందుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ రెండు రోజుల్లో మన కరెన్సీ ప్రకారం ఈ సినిమా 20.6 కోట్లు షేర్ ని అందుకోగా 9.37 కోట్లు షేర్ ని రాబట్టిందట.
దీనితో టోటల్ గా ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ ని దాటి 57 కోట్లకి పైగా రెండు రోజులులో అందుకుందట. ఈ సినిమాకి ఉన్న టార్గెట్ కి అయితే ఇంకా చాలా రాబట్టాల్సి ఉంది. మరి చూడాలి రాధే శ్యామ్ లెక్కకి ఫినిషింగ్ టచ్ ఎక్కడ వస్తుందో. అయితే హిందీలో మాత్రం వసూళ్లు బాగోకపోవడం ఈ చిత్రానికి బాగా దెబ్బ పడింది అని చెప్పాలి.