బాక్సాఫీస్ రిపోర్ట్ : వరల్డ్ వైడ్ “కార్తికేయ 2” కి క్రేజీ వసూళ్లు..3 రోజుల్లో ఎంతంటే.!

తెలుగు సినిమా దగ్గర ఎప్పుడూ కూడా కంటెంట్ కింగ్ అని మళ్ళీ ప్రూవ్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ మూడు వరుస హిట్స్ తో ఈ రెండు వారాల్లో తెలుగు బాక్సాఫీస్ కళకళలాడింది. మరి లేటెస్ట్ గా ఈ సినిమాలో లాస్ట్ గా వచ్చిన “కార్తికేయ 2” చిత్ర యూనిట్ అంచనాలు అందుకోని మూడు రోజుల్లో భారీ వసూళ్లు కొల్లగొట్టినట్టు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమా హిందీ ఓవర్సీస్ లో కూడా షోస్ పెంచుకుంటూ వెళ్తుండడం తో ఒకొక్క రోజు అంతకంతకూ కలెక్షన్స్ పెరిగుతున్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఇక మూడు రోజుల్లో అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 12 కోట్ల మేర షేర్ ని రాబట్టగా హిందీలో రికార్డు షో లు పెంచుకుంటూ నిన్న ఇండిపెండెన్స్ డే తో ఒక కోటి నెట్ వసూళ్లు ఈ చిత్రం అందుకుంది.

అంతే కాకుండా ఓవర్సీస్ లో అయితే ఈరోజు అప్డేటెడ్ వసూళ్లతో హాఫ్ మిలియన్ డాలర్లు వసూళ్ళని క్రాస్ చేసింది. దీనితో అయితే మూడు రోజుల్లో ఈ సినిమా అయితే ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల మేర షేర్ ని టచ్ చేసినట్లు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. అలాగే ఇంత తక్కువ సమయంలో యంగ్ హీరో నిఖిల్ కెరీర్ లో ఇదే ఆధిక్యం అని తెలుస్తోంది.

దీనితో అయితే ఓవరాల్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సత్తా చాటుతోంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా లో అనుపమ పరమేశ్వన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.