“ఆచార్య” 5 రోజుల వసూళ్లు..మరిన్ని షాకింగ్ రిజల్ట్స్.!

Box Office Report Of Acharya

Box Office Report Of Acharya : మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎదుర్కొన్న పలు ఘోరమైన ప్లాప్ చిత్రాల్లో లేటెస్ట్ గా వచ్చిన సినిమా “ఆచార్య” కూడా ఒకటి. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ఏమనుకొని స్టార్ట్ చేసారో గాని ఈ భారీ బడ్జెట్ సినిమా అనుకోని రీతి వసూళ్లతో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. మొదటి రోజు అంటే ఇద్దరు స్టార్ హీరోలు చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల స్టార్డం తో 50 కోట్ల మేర గ్రాస్ వచ్చేసింది.

కానీ సోమవారం నుంచి మొదలు కావాల్సిన అసలు మ్యాచ్ ఆచార్యకి ఆశ్చర్యకరంగా రెండో రోజు నుంచే స్టార్ట్ అయ్యిపోయింది. దీనితో ఈ సినిమా దారుణమైన నంబర్స్ చూడక తప్పలేదు. ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 5 రోజుల వసూళ్లు చూసినట్టు అయితే షాకింగ్ రిజల్ట్స్ అనే చెప్పాలి.

ఈ ఐదు రోజుల్లో ఈ సినిమా 50 కోట్ల షేర్ మార్క్ ని కూడా టచ్ చేయలేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ చిత్రం కేవలం 46.కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టిందట. అలాగే 70 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం అందుకుందట. దీనితో ఈ సినిమా సగానికి పైగా నష్టాలు మిగిల్చేలా కనిపిస్తుంది.

మరి దీనిపై చిత్ర నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్స్ మధ్య కీలక మీటింగులు జరుగుతున్నాయని అంటున్నారు.