సౌత్ ఎంట్రీ పై ఓపెన్ అయ్యిన బాలీవుడ్ హాట్ బ్యూటీ.!

జెనరల్ గా మన సౌత్ నుంచి వచ్చిన హీరోయిన్ లు బాలీవుడ్ లో ఆఫర్స్ కోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అయితే ఇది ఒకప్పటి మాట కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ మన సౌత్ లో సినిమాలు చెయ్యాలని ఆరాట పడుతూ ఉండడం లేటెస్ట్ హాట్ టాపిక్. మరి ఇప్పుడు మన తెలుగు సహా సౌత్ ఇండియా సినిమా సత్తా ప్రపంచ నలు మూలలకి చేరుతుంది.

దీనితో బాలీవుడ్ నుంచి ఒక్క హీరోయిన్స్ మాత్రమే కాకుండా ఇతర స్టార్స్ కూడా సౌత్ ఫిల్మ్ మేకర్స్ తో వర్క్ చెయ్యాలని కోరుకుంటున్నారు. అలాంటి స్టార్స్ లో అయితే బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ఉంది. ఈమె ఎప్పుడు నుంచో సౌత్ ఇండస్ట్రీ పై మనసు పారేసుకుంది.

అయితే లేటెస్ట్ గా హైదరాబాద్ కి తాను రాగా సినిమా ప్రమోషన్స్ మాట్లాడుతూ సౌత్ లో ఎంట్రీ పై ఓపెన్ అయ్యింది. తనకు సౌత్ సినిమా అంటే చాలా ఇష్టమని ఇక్కడ నుంచి ఆఫర్ ఎప్పుడు వస్తుందా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అలాగే ఎన్టీఆర్ తో నటించే అవకాశం కోసం కూడా చూస్తున్నానని మళ్ళీ హింట్ ఇచ్చింది.

ఎన్టీఆర్ ఒక అద్భుతమైన నటుడు అని పొగిడేసింది. ఆల్రెడీ ఎన్టీఆర్ 30 లో హీరోయిన్ ఈమె అని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈమె హైదరాబాద్ లో కూడా దిగింది. మరి ఇప్పుడు పరిస్థితులు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ఆ అధికారిక అప్డేట్ అయితే కొన్ని రోజుల్లో ఆశించవచ్చని చెప్పేలా ఉంది ఇపుడు.