NTR – Koratala Shiva: ఎన్టీఆర్ కొరటాల సినిమాలో సందడి చేయనున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా!

NTR – Koratala Shiva: టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్న సంగతి మనకు తెలిసిందే.ఎన్టీఆర్ తన 30వ చిత్రంగా కొరటాల దర్శకత్వంలో రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఈనెల ఏడవ తేదీ అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి ఇప్పటి వరకు ప్రశ్నార్థకంగా ఉండేది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే ముద్దుగుమ్మ ఎవరో తెలిసిపోయింది.

ముందు నుంచి ఈ సినిమాలు ఎంతోమంది హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ పేరు ఉండటం విశేషం.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఆలియా భట్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొరటాల శివ సార్ కథ చెప్పగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని తెలిపారు. అయితే ఇంత తొందరగా తిరిగి ఎన్టీఆర్ తో నటించే అవకాశం వస్తుందని తాను అనుకోలేదని అలియా ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతాగ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని సుధాకర్ మిక్కిలినేనితో కలిసి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్‌ని ఖరారు చేశారు. డిసెంబర్ 7వ తేదీ ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించి మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ లో జరుపుకోనుంది.