Alia Bhatt: దీపికా విషయంలో ఆలియాభట్ పై ట్రోలింగ్స్?

Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఆలియాభట్ కూడా ఒకరు. అలియా భట్ కు బాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాకుండా బాలీవుడ్ లో మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్ లలో ఒకటిగా అలియాభట్ దూసుకుపోతోంది. అలియా భట్ తన వ్యక్తిగత పరంగా కానీ,లేదా వృత్తిపరంగా కానీ తనకు తోచిన ఆలోచనా విధానాన్ని ఎటువంటి మొహమాటం లేకుండా తెలియజేస్తూ ఉంటుంది. ఈ విషయంలో అలియా భట్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఇకపోతే అలియా భట్ ప్రస్తుతం టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అలియా బట్ సీత పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి తో పాటు అలియా భట్ కూడా పాల్గొంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అలియా. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో అలియా ఫోటోలకు ఫోజులు ఇస్తూ పగలబడి నవ్వుతూ కనిపించింది.

ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు ఇది ఫేక్ నవ్వు అంటూ ట్రోలింగ్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ వీడియో ఫై నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె నవ్వు చూస్తుంటే బాధగా ఉంది అని ఒకరు కామెంట్ చేయగా.. ఇంకొకరు బలవంతంగా నవ్వుతుంది అంటూ కామెంట్ చేశారు. ఒక నిజం అయితే ఇలా ఫేక్ నవ్వు నవ్వుతున్న అలియాభట్ గతంలో దీపికా పదుకొనే నవ్వుని విమర్శించింది అంటూ నెటిజెన్ ఘాటుగా విమర్శించాడు. కెమెరాల కోసం ఇలా ఫేక్ స్మైల్ ఇస్తుంది అంటూ మరొక వ్యక్తి కామెంట్ చేశాడు. మొత్తానికి అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.