చైనాలో ఘోర విమాన ప్రమాదం

చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది బోయింగ్‌ 737 విమానం చైనాలో గుయాన్జి ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బందితో కలిసి మెుత్తంగా 133 మంది ప్లైట్‌లో ఉన్నట్లు తెలుస్తో్ంది. విమానం కూలిన ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగినట్లు చైనా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.