కేంద్ర నిధుల గురించి కేసీఆర్ తో చర్చలు చేస్తామంటున్న ఈటెల రాజేందర్..?

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తాజాగా నాంపల్లిలోని తమ పార్టీ కార్యాలయంలో అక్కడి మీడియా సమావేశంలో కొన్ని విషయాలు పంచుకున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వెలవెలబోతుందని.. ఇక అందులో పాల్గొనడానికి అధికారులు ముఖం చాటేస్తున్నారు అని అన్నారు.

సర్పంచులకు 14,15 వ ఆర్థిక సంఘం నిధులు తప్ప మిగతా నిధులు రావట్లేదని.. కేంద్రం నుంచి వచ్చే ఉపాధిహామీ నిధులతోనే పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఫలితం పొందుతుందని అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో లేదా ఆర్థిక మంత్రి హరీష్ రావు తో చర్చకు దిగుతామని అన్నారు.