గంటాకు భారీ ఆఫర్ ఇచ్చిన బీజేపీ..? అదే కనుక జరిగితే గంటాకు ఎదురేలేదు

ganta srinivas rao

 2019 లో జగన్ ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న నాటి నుండి నేటి వరకు ప్రతి రోజు ఎదో ఒక విధంగా మీడియాలో వినిపిస్తున్న పేరు గంటా శ్రీనివాస్ రావు. మొదటిలో టీడీపీ కి దూరంగా ఉంటున్నాడు, కారణాలు ఏమిటి..? అనే కోణంలో అయన పేరు వినిపించింది. తర్వాత వైసీపీలో చేరబోతున్నాడని, ముహుర్తాలు కూడా ఫిక్స్ అయ్యాయని ఒక సారి, కాదు కాదు వైసీపీ లోకి వెళ్ళటానికి డోర్స్ తెరుచుకోలేదని మరోసారి గంటా పేరు ప్రస్తావనకు వస్తూనే ఉంది.

ganta srinivas rao

 తాజగా గంటా బీజేపీలోకి రాబోతున్నాడు అనే వాదన గత కొద్దీ రోజులుగా వినిపిస్తుంది. ఇప్పుడు దానికి బలం చేకూర్చే విధంగా మరో వాదన కూడా వినిపిస్తుంది. అదేమంటే విశాఖ పార్లమెంట్ సీటు. దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉంటే అందులో ఒక ఇరవై స్థానాలు ముందు వరసలో ఉంటాయి. అలాంటి వాటిల్లో విశాఖ ఒకటి. పైగా ఆంధ్ర ప్రదేశ్ కు కాబోయే రాజధాని అంటూ ప్రచారం జరుగుతుంది. పైగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రక్షణ పరంగా ఎంతో కీలకమైన ప్రదేశం విశాఖ.

 ఈ సీట్లో 2014 ఎన్నికల్లో బీజేపీ గెలిచి తన కలను అలా నెరవేర్చుకుంది. ఇక 2024 ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే రెడీ అయిపోతోంది. ఈ సీటుని అందరికీ చూపించి పార్టీలోకి పెద్ద తలకాయలను తేవాలనుకుంటోందిట. విశాఖ ఎంపీ సీటును మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆఫర్ చేసినట్లుగా తాజగా రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. గంటా కనుక బీజేపీలోకి వస్తే ఆయనను విశాఖ నుంచి ఎంపీగా గెలిపించుకుని ఆనాటికి కేంద్ర మంత్రిని చేస్తామంటూ బిగ్ ఆఫర్ నే బీజేపీ ఇచ్చేసిందని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది.

 మరి ఇంత పెద్ద ఆఫర్ కు గంటా ఏమన్నాడో మాత్రం తెలియలేదు. రాబోయే ఎన్నికల్లో కూడా దేశంలో బీజేపీ తన మిత్ర పక్షాలతో కలిసి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కనుక ఆంధ్ర నుండి ఒక ఎంపీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మంత్రి వర్గంలో చేర్చుకునే అవకాశం లేకపోలేదు. పైగా విశాఖలో గంటాకు మంచి పట్టు ఉంది. ఆ కోణంలో చూసుకుంటే గంటాకు ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి.

 ఇదే సమయంలో ఈ సీటు ఆఫర్ ఒక్క గంటాకు మాత్రమే కాదు. గత ఎన్నికల్లో విశాఖలో పోటీచేసి ఓడిపోయినా జేడీ లక్ష్మీ నారాయణకు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి పోటీ చేసి 2 లక్షల 70 వేల దాకా ఓట్లను సాధించారు. 2024లో ఆయనను బీజేపీలోకి తెచ్చి మరీ విశాఖ సీటు ఇవ్వాలని బీజేపీ ప్లాన్ వేస్తోందని ఇంతకు మునుపు ప్రచారం జరిగింది. దీనిని బట్టి విశాఖ సీటు చూపించి పెద్ద తలకాయలను బీజేపీకి లాగాలని చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి