బర్త్ డే స్పెషల్.. పోకిరి మాత్రమే కాదు ఒక్కడు కూడా రీ రిలీజ్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం పోకిరి సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు ఆయన చెప్పే డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.తాజాగా ఈ సినిమాని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీ ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లలో విడుదల చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఓపెన్ కావడంతో గంటల వ్యవధిలోనే టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ విధంగా ఈ సినిమాకు అధికంగా డిమాండ్ ఉండటంతో అభిమానుల ఒత్తిడి పెరగటం వల్ల నిర్వాహకులు మరికొన్ని థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శితం చేస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఈ సినిమాని విడుదల చేయడం విశేషం. ఇకపోతే కేరళలో కూడా మహేష్ బాబు పోకిరి సినిమాని స్పెషల్ షో వేనున్నట్లు వెల్లడించారు.

ఈ విధంగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పోకిరి సినిమా మాత్రమే కాకుండా ఒక్కడు సినిమాని కూడా పలు ప్రాంతాలలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇలా ఒక హీరో నటించిన సినిమాని కొన్ని సంవత్సరాలకు తిరిగి విడుదల చేయడంతో ఈ సినిమాపై అభిమానులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.మహేష్ బాబుతో మొదలైన ఈ ట్రెండ్ భవిష్యత్తులో మరికొన్ని సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతాయని చెప్పాలి.అయితే మహేష్ బాబు సినిమాలు విడుదలై వచ్చిన డబ్బుని మొత్తం ఆయన ఫౌండేషన్ కి విరాళంగా ప్రకటిస్తున్నారు.