నటరాజ్ మాస్టర్ కి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిన బిందు మాధవి తండ్రి..?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. అయితే షోలో కంటెస్టెంట్ లుగా ఎంట్రీ ఇచ్చిన నటరాజ్ మాస్టర్, బిందుమాధవి లకు ఒకరంటే ఒకరికి పడదు. వీరిద్దరు షో ప్రారంభం నుంచే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ దూషించుకుంటూ వచ్చారు. ఇక హౌస్ లో నామినేషన్స్ విషయంలో అయితే నట్రాజ్ మాస్టర్ బిందు అమ్మాయి తో గొడవ పడటమే కాకుండా ఒక సమయంలో బిందు మాధవి తండ్రి పెంపకంలో ఫెయిల్ అయ్యారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేశారు. దాంతో చివరివారంలో ఫైనల్స్ లోకి అడుగు పెట్టాల్సిన నట్రాజ్ మాస్టర్, లాస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిన బయటకు వచ్చేశాడు.

బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న నట్రాజ్ మాస్టర్ బిందుమాధవి గురించి మాట్లాడుతూ పలు షాకింగ్ కామెంట్స్ కూడా చేశాడు. అంతేకాకుండా బిందుమాధవి పిఆర్ టీమ్స్ వల్లే టైటిల్ గెలిచింది అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నాడు. ఇదే విధంగా తమిళంలో కూడా పిఆర్ టీమ్ ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో ఆడపులి అన్న ట్యాగ్ ను తగిలించుకొని హైలైట్ అవుతు చివరికి టైటిల్ గెలిచింది అంటూ ఆరోపిస్తున్నారు నట్రాజ్ మాస్టర్. అయితే నట్రాజ్ మాస్టర్ ఆరోపణలపై స్పందించిన బిందుమాధవి తండ్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

బిందు మాధవి ఎలాంటి పీఆర్ టీమ్ ని మెయింటెయిన్ చేయలేదని, ఆమె ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర అయిందని, అందుకే అభిమానులు ఆమెకు అత్యధికంగా ఓటు వేసి గెలిపించారని, ఇక నట్రాజ్ మాస్టర్ అంటే ఏమిటో ప్రపంచం మొత్తం చూసింది అంటూ కౌంటర్ ఇచ్చారు బిందుమాధవి తండ్రి. నాగరాజు మాస్టర్ హౌస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో అందరికీ తెలుసు అని తెలిపారు బిందు తండ్రి. అయితే తాను బిగ్ బాస్ ఫైనల్ కి వెళ్ళినప్పుడు నట్రాజ్ మాస్టర్ అతని దగ్గరకు వచ్చి సార్ నేను తప్పుగా మాట్లాడాను దయచేసి నన్ను క్షమించండి అని అడిగాడట. సరే నాయనా అంటూ బిందు తండ్రి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారట. కాబట్టి నట్రాజ్ మాస్టర్ బిందుమాధవి పై చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలే అంటూ బిందుమాధవి తండ్రి కొట్టిపారేశారు.