Actor Prabhas : ప్రభాస్, అమితాబ్ ల ప్రపంచ స్థాయి సినిమాపై బిగ్ అప్డేట్స్..!

Actor Prabhas : ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అనేక చిత్రాలు అన్ని పాన్ ఇండియా మరియు పాన్ ఆసియన్ స్థాయిలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటిలో మాత్రం ఒక్క సినిమాని ఏకంగా ప్రపంచ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అదే సినిమా “ప్రాజెక్ట్ కే”. “ఎవడే సుబ్రహ్మణ్యం”, “మహానటి” ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రపంచ స్థాయి హంగులతో తెరకెక్కిస్తున్నారు.

మరి ఇప్పుడు ఈ సినిమాపై ఒక బిగ్ అప్డేట్ రెండు ఎక్సయిటింగ్ పోస్టులు బయటకొచ్చాయని చెప్పాలి. మొదటగా ఏమిటంటే ఈ చిత్రంలో ప్రభాస్ మరియు దిగ్గజ నటుడు అమితాబ్ లపై మొట్ట మొదటి కీలక సన్నివేశాన్ని తెరకెక్కించడం జరిగిందట. అది కూడా నిన్ననే అయ్యినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

ఇక అలాగే ఈ షూట్ పైనే ఈ ఇద్దరు దిగ్గజాలు తమ ఎక్సయిటింగ్ స్పందనలు తెలియజేసారు. బాహుబలి ప్రభాస్ తో మొట్ట మొదటి సారి నటించడం జరిగింది అని ప్రభాస్ చాలా వినయంతో కూడుకున్న నటుడు అని అతని ఆరా తనతో కంపెనీ అద్భుతంగా ఉన్నాయి అని అమితాబ్ తెలపగా ప్రభాస్ అయితే మరింత ఆసక్తికర పోస్ట్ పెట్టాడు..

తన చిరకాల కోరిక అమితాబ్ తో నటించాలి అనేది ఈరోజుతో తీరిపోయింది అని ఇదొక కలలా అనిపిస్తుంది అని ప్రభాస్ తెలిపాడు. దీంతో ఈ ఇద్దరి పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా అశ్వనీ దత్ దాదాపు 500 కోట్లతో ఈ సినిమా బడ్జెట్ ని సెట్ చేశారు.