Kgf 2 : బిగ్గెస్ట్ అప్డేట్ : “కేజీఎఫ్ 2” సెన్సేషనల్ ట్రైలర్ కి ముహూర్తం ఖరారు.!

Kgf 2 : పాన్ ఇండియా బాక్సాఫీస్ మాన్స్టర్ కన్నడ ఇండస్ట్రీ సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2” కోసం అంతా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆఫ్టర్ “బాహుబలి 2” ప్రపంచ వ్యాప్తంగా మన ఇండియన్ ఫిల్మ్ లవర్స్ ఎక్కడ ఉన్నా కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్న సీక్వెల్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమానే అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.
అయితే అసలు ఈ సినిమా పై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ తోనే అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఏకంగా ప్రపంచ స్థాయి హాలీవుడ్ భారీ సినిమాలు కూడా అందుకోలేని రేంజ్ రెస్పాన్స్ ఈ సినిమా టీజర్ కి వచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి ఈ సినిమాపై పెద్ద అప్డేట్స్ పెద్దగా లేవు కానీ మొత్తానికి ఇప్పుడు ఈ భారీ సినిమా నుంచి అవైటెడ్ ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడానికి చిత్ర బృందం ముహూర్తం ఫిక్స్ చేసేసారు.
ఈ మార్చ్ 27 న ఈ ట్రైలర్ ని అన్ని భాషల్లోనూ ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా రాత్రి 6 గంటల 40 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో ఒక్కసారిగా ఇప్పుడు ఈ ట్రైలర్ పై అంచనాలు పీక్స్ లోకి వెళ్లిపోయాయి. మరి ఈ సినిమాలో ఎలాంటి నటులు ఎంత పవర్ ఫుల్ పాత్రలు చేసారో కూడా చెప్పక్కర్లేదు. అందుకే బాక్సాఫీస్ మాన్స్టర్ గా పిలవబడుతున్న ఈ సినిమా బ్రాండ్ ఆ రేంజ్ లో ముద్ర పడిపోయింది. ఇక ఈ ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.. చూడాల్సిందే.
https://twitter.com/hombalefilms/status/1499263301242343425?s=20&t=VTTEAh-C3t_BpKo3ObNGVw