Radhe Shyam Trailer 2 : బిగ్గెస్ట్ అప్డేట్ : “రాధే శ్యామ్” రెండో ట్రైలర్ కి ముహూర్తం ఖరారు..!

Radhe Shyam Trailer 2

Radhe Shyam Trailer 2 :  పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా డస్కీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా నుంచి మొదట రిలీజ్ లో భాగంగా ఫస్ట్ ట్రైలర్ ని మేకర్స్ వదిలేసారు.

కానీ ఇప్పుడు మళ్లీ రెండో ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడానికి కూడా చూస్తున్నారని కన్ఫర్మ్ కాగా ఇప్పుడు ఫైనల్ గా ఈ బిగ్గెస్ట్ అప్డేట్ ని రివీల్ చేసేసారు. మరి ఈ అప్డేట్ తో ఈ మార్చ్ 2 నే ఈ భారీ పాన్ ఇండియా చిత్రం రెండో ట్రైలర్ ని లాంచ్ చెయ్యబోతున్నారట. అంతేకాకుండా ట్రైలర్ రిలీజ్ కి టైం ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసేసారు.

మార్చ్ 2 న మధ్యాహ్నం 3 గంటలకి ఈ రెండో ట్రైలర్ ని రిలీజ్ చెయ్యబోతున్నారని ఒక స్టన్నింగ్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ని మొదట ట్రైలర్ తో పోలిస్తే మరింత ఆసక్తికరంగా థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో రాబోతుంది అని కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలని ఇప్పటి నుంచే అందరిలో ఆసక్తి నెలకొంది.