Adipurush : ఇన్సైడ్ టాక్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్ వస్తుందట.!!

Adipurush : ఇప్పుడు ప్రెజెంట్ జెనరేషన్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కి టైం అసలేం బాగోలేదని చెప్పాలి. తాను చేసిన రెండు భారీ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ప్లాప్ అవ్వడం తన కెరీర్ లో చాలా డౌన్ తీసుకొచ్చింది. అయితే వీటి తర్వాత కూడా ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ పరంగా మాత్రం అభిమానులు కాస్త ధైర్యంగా ఉన్నారు.

ఎందుకంటే ఈ సినిమాలు ఇప్పుడు ప్లాప్ అయ్యిన వాటి కన్నా ఎక్కువ రీచ్ ఉండేవి భారీ చిత్రాలు కావడం. అయితే ఈ సినిమాల్లో నెక్స్ట్ రిలీజ్ కి రెడీగా ఉన్న భారీ సినిమానే “ఆదిపురుష్”. ఈ సినిమాలో ఏకంగా ప్రభాస్ శ్రీరాముడి గెటప్ లో కనిపించనున్నాడు.

దీనితో మాత్రం ఇండియన్ సినిమా షేక్ అవ్వడం ఖాయం కాగా దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెలుగు మరియు హిందీ భాషల్లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక క్రేజీ సమాచారం తెలుస్తుంది. చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు అని టాక్.

అలాగే దీనితో పాటుగా టీజర్ కూడా రావచ్చని తెలుస్తుంది. మరి ఇదెప్పుడు అంటే ఈ ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా ప్లాన్ చేస్తున్నారట. రాముడిగా ప్రభాస్ ని చూడాలని ఆసక్తిగా చూస్తున్నవారికి మాత్రం ఇది వచ్చాక పూనకాలు గ్యారెంటీ అని చెప్పాలి.

ఇక ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటించగా లంకేశుని పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది.