Priyanka Singh: సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ప్రియాంక సింగ్..?

Priyanka Singh: తెలుగు ప్రేక్షకులకు ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక సింగ్ ఆ తర్వాత బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో మోస్ట్ గ్లామరస్ లేడీగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది. అలాగే బిగ్ బాస్ హౌస్ లో మానస్ పై ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తూ హౌస్ కి గ్లామర్ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే హౌస్ లో పింకీ, మానస్ వెనుక పడటం వల్ల నెటిజన్ నుంచి విమర్శలు వచ్చాయి.

అంతేకాకుండా ప్రియాంక సింగ్ ప్రవర్తన విసుగు తెప్పించేలా ఉంది అంటూ కామెంట్లు కూడా వినిపించాయి. మానస టాప్ ఫైవ్ లో నిలవగా ప్రియాంక మాత్రం రెండు వారాల ముందే ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయినప్పటికీ ఆమె ఎంతోమంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంక సింగ్ కు సినిమా ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత రచయిత అయినా కోనవెంకట్ ప్రియాంక సింగ్ కి సినిమా ఆఫర్ ఇచ్చాడు. ఇక అదే విషయాన్ని ప్రియాంక సింగ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కోన వెంకట్ తో దిగిన ఫోటోని పంచుకుంటూ త్వరలోనే ఒక ఎగ్జైట్మెంట్ తో రాబోతున్నాను.. కోన వెంకట్ తో టైమ్ స్పెండ్ చేయడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది ప్రియాంక సింగ్.

 

అయితే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇక ఆ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది ప్రియాంక. ఇకపోతే ప్రియాంక విషయానికి వస్తే ప్రియాంక సింగ్ అసలు పేరు సాయి తేజ్. జబర్దస్త్ షోలో కమెడియన్ గా లేడీ గెటప్ లు వేస్తూ అలరించినా ఆమె ఆ తర్వాత లింగ మార్పిడి చేయించుకుని లేడీగా మారిపోయారు. అనంతరం ప్రియాంక సింగ్ గా పేరు కూడా మార్చుకున్నారు. తెలుగు రియాల్టీ షో అయిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షోలో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది.