బిగ్ ఎలిమినేషన్: జెస్సీ అవుట్.. రీజన్ ఏంటంటే.!

Bigg Elimination Jessie Wicket Down | Telugu Rajyam

గత కొన్ని రోజులుగా బిగ్ హౌస్‌లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన జెస్సీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అనారోగ్యం కారణంగా టాస్కుల్లోనూ యాక్టివ్‌గా పాల్గొనలేకపోతున్నాడు జెస్సీ. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడని కారణంగా మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను హౌస్ నుండి బయటికి పంపించాలని నిర్ణయించుకున్నాడు బిగ్‌బాస్.

గతంలో అనారోగ్యం కారణంగా సింగర్ నోయల్ కూడా ఇలాగే మధ్యలోనే హౌస్ నుండి బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నోయల్ మళ్లీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇస్తాడనుకున్నారు కానీ, అది జరగలేదు. అదే సీజన్‌లో గంగవ్వ కూడా అనారోగ్యం కారణంగానే బయటికి వచ్చేసింది. ఇప్పుడు జెస్సీ.

జెస్సీ బయటికి వెళ్లిపోతుండడంతో, హౌస్ మొత్తం కన్నీటి పర్యంతమైంది. త్రిమూర్తులుగా పాపులర్ అయిన షన్నూ అండ్ టీమ్ అయితే, మరీ ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయింది. వి మిస్ యూ రా.. అంటూ జెస్సీని కన్నీటితో బాయ్ చెప్పడం జరిగింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles