ఎలిమినేషన్ నెపంతో హౌస్ నుండి బయటికి పంపించి, సీక్రెట్ రూమ్‌లో ఉంచాడు వన్ ఆఫ్ ది బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన లోబోని మన ప్రియమైన బిగ్‌బాస్. నాలుగు రోజులు సీక్రెట్ రూమ్‌లో ఉంచి, సకల మర్యాదలూ చేసి, హౌస్‌లోని మిగిలిన కంటెస్టెంట్స్ మనస్తత్వాలనూ, కుళ్లు, కుతంత్రాలనూ, ఫేక్ రాజకీయాలనూ తెలుసుకునే అవకాశం లభించింది తద్వారా లోబోకి.
అంతా బాగానే ఉంది. సీక్రెట్ రూమ్‌లోంచి అవన్నీ తెలుసుకుని, మళ్లీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన లోబో సరికొత్త గేమ్ ప్లాన్‌తో రెచ్చిపోవచ్చుననుకున్నాడు. అయితే సీన్ రివర్స్ అయ్యింది. ఆఫర్ ఇచ్చినట్లే ఇచ్చి, పెద్ద పిడి పెట్టాడు లోబోకి బిగ్‌బాస్.
వీకెండ్ గేమ్‌లో భాగంగా, హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్స్ గురించిన అభిప్రాయాలను ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్న నాగార్జున, లోబోని మాత్ర సీక్రెట్‌గా కన్ఫెషన్ రూమ్‌లోకి తీసుకెళ్లి తన అభిప్రాయం చెప్పమన్నాడు. పాపం సీక్రెటే కదా అని, లోబో ఒక్కొక్కరి పైనా తన అభిప్రాయాలనూ కాస్త స్ర్టాంగ్‌గా నాగార్జునకు వివరించేశాడు. కట్ చేస్తే, అది కేవలం లోబోకే సీక్రెట్.
హౌస్ మేట్స్ అంతా లోబో మాటలు విన్నారు. దాంతో లోబోపై వారికి నెగిటివిటీ ఏర్పడింది. రవి, యానీ మాస్టర్ తదితరులు లోబోని నమ్మి మోసపోయామనుకున్నారు. ఈ ఎఫెక్ట్ హౌస్‌లో లోబోపై ఎలా ఉంటుందనేది ముందు ముందు చూడాలిక.