Kaushal Manda: బిగ్‌బాస్ ఇప్పుడు తెలుగులో కూడా ఓటీటీలో ప్రసారం కాబోతుంది. కాగా పాత వాళ్లను కూడా తీసుకుంటారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అలాంటి అవకాశం మళ్లీ వస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నపై సినీ నటుడు కౌషల్ ఈ విధంగా స్పందించారు.
ఒకసారి గెలుపు రుచి చూసిన తర్వాత మళ్లీ మళ్లీ అదే రుచిని ఇష్టపడమని కౌషల్ అన్నారు. ఒకసారి ఆ రుచిని ఎంజాయ్ చేస్తాం, మళ్లీ కొత్తరుచిని చూపిస్తే పాత రుచిని మర్చిపోతారని ఆయన చెప్పారు. ఇకపోతే ఆయనకు మంచి స్క్రిప్ట్స్ రాలేదని, రోజూ తన ఆఫీస్ టేబుల్‌పై కనీసం 10 స్క్రిప్ట్స్ అయినా ఉంటాయని ఆయన అన్నారు. కానీ ఆ స్క్రిప్ట్స్ తనకు నచ్చలేదని, ఒకవేళ స్ర్కిప్ట్ నచ్చినా ప్రొడక్షన్ నచ్చలేదని ఆయన తెలిపారు. అలా చాలా వరకు తన దాకా రాకుండా ఉండిపోయానని ఆయన అన్నారు..
అయితే తాను బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత తాను ప్రతి సినిమాల్లో చేస్తాను అని చాలా అటిట్యూడ్‌తో చెప్పానని ఆయన అన్నారు. లేదంటే వాళ్లు బడ్జెట్ పెట్టలేక, ధైర్యం చేసి ఉండకపోవచ్చు అని ఆయన చెప్పారు. అలా చాలా కారణాలున్నాయని ఆయన తెలిపారు. కాగా తనకు ఆ షో నుంచి వచ్చాక చాలా నెగిటివిటీ వచ్చిందని చాలా మంది అంటారు గానీ, మనిషి జీవితంలో మన సమాజంలో ముఖ్యంగా మన దేశంలో మెంటాలెటీ ఎలా ఉంటుందంటే ఒక మనిషి ఎదిగాడంటే పక్కనున్న ఫ్రెండ్స్ కూడా సపోర్టు చేయరని, మనం ఏదైనా గొప్పపని చేస్తే ముందుకు వెళ్లమని ఎంకరేజ్ చేసేటటువంటి సమాజం కాదని ఆయన అన్నారు. మనకన్నా ఎదిగిపోతున్నాడు, ముందుకెళ్తున్నాడు అని ప్రతీ ఒక్కరూ అనుకుంటారని ఆయన చెప్పారు. అంతే కాదు తమ ఆర్టిస్టుల్లోనే చాలా మందికి తాను గెలవడం ఇష్టం లేదని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. చాలా మంది తనకు అంత ఫేమ్ వస్తుంటే అది చూసి జీర్ణించుకోలేకపోయారని కౌషల్ అన్నారు.