బిగ్ బాస్ టైటిల్ బిందుమాధవికైనా కలిసి వస్తుందో.. లేదో..!

టాలీవుడ్ బుల్లితెరపై మంచి ఆదరణతో దూసుకుపోతున్న బిగ్ బాస్ చాలా వరకు ఎవరికీ కలిసి రాలేదనే చెప్పాలి. ముఖ్యంగా టైటిల్ విన్నర్స్ మాత్రం దరిదాపుల్లో కూడా లేరు. మరి ఇటీవలే ఓ టి టి వేదికగా నాన్ స్టాప్ బిగ్ బాస్ రియాల్టీ షో ముగియగా ఇందులో టైటిల్ విన్నర్ గా గుర్తింపు తెచ్చుకున్న బిందుమాధవి పరిస్థితి ఏంటి అని అతని అభిమానులు ఆలోచనల్లో పడ్డారు.

ఇప్పటికే తను టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోలేక కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అక్కడ కూడా అంతగా స్టార్ హోదాని తెచ్చుకోలేక పోయింది. మళ్లీ తెలుగు బిగ్ బాస్ ద్వారా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టగా ఈ సారి అయినా ఈ అమ్మడికి అవకాశాలు వస్తాయో లేదో అని అనుకుంటున్నారు తన అభిమానులు.