బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరంటే?

బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలుగులో కూడా విపరీతమైన ఆదరణ లభించింది.ఇక ఈ కార్యక్రమం అన్ని భాషలలో ప్రసారం అవుతూ ఇప్పటికే కొన్ని సీజన్లను పూర్తి చేసుకుంది. తెలుగులో కూడా బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకొని బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది.ఇక తాజాగా నిర్వాహకులు సీజన్ 6 కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతుందని తెలుస్తుంది.

సీజన్ 6 కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ వీళ్ళే అంటూ పెద్దఎత్తున కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే ఈ సీజన్ లో కామన్ మ్యాన్ ఎంట్రీ ఉంటుందని స్వయంగా నాగార్జున ప్రకటించారు. ఇక పోతే ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. శరవేగంగా పనులు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానుంది. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీజన్ 6 కార్యక్రమంలోకి టాలీవుడ్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నారని వార్త వైరల్ అయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎం.ఎస్.రాజు వారసుడిగా తూనీగ తూనీగ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు హీరో సుమంత్ అశ్విన్. ఈయన హీరోగా అంతకు ముందు ఆ తర్వాత, కేరింత,హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ఆదరణ నోచుకోలేక పోయాడు. ఈ క్రమంలోనే తనకు మరింత ప్రేక్షకాదరణ రావడం కోసం సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ సీజన్ 6 ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి ఉంది.