Bigg Boss Ultimate: బిగ్‌బాస్‌ షో హోస్ట్‌ గా యంగ్‌ హీరో ఎవరో తెలుసా?

Bigg Boss Ultimate: ఇటీవలే తమిళ బిగ్ బాస్ షో నుంచి విశ్వనటుడు కమల్ హాసన్ తప్పుకున్న విషయం తెలిసిందే. కమలహాసన్ ఈ స్థానం నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఎవరు భర్తీ చేస్తారా? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదట కమలహాసన్ స్థానంలో రమ్యకృష్ణ హోస్ట్ నిలబెట్టాలని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ అల్టిమేట్ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్ కారణంగా ఆ షోకి రమ్యకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు విముఖత చూపినట్లు వార్తలు వినిపించాయి.

 

దీనితో కమలహాసన్ స్థానంలో బిగ్ బాస్ హోస్ట్ గా కోలీవుడ్ యంగ్ హీరోని సంప్రదించగా అతడు అందుకు ఓకే చెప్పినట్టు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజం అని తెలిపింది బిగ్ బాస్ టీం. తమిళ బిగ్ బాస్ ఓటీటికి తమిళ హీరో శింబు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు బిగ్ బాస్ నిర్వహకులు. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేసింది. మరి హీరో శింబు బుల్లితెర ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి మరి.