కొద్ది రోజులలో ప్రారంభంకానున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్.. విడుదలైన ప్రోమో!

బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతగానో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికే 5 సీజన్లను పూర్తి చేసుకొని తెలుగులో కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ కార్యక్రమం 24 గంటల పాటు ప్రసారం అవుతూ ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ప్రసారం అయింది.ఇకపోతే తాజాగా నిర్వాహకులు సీజన్ సిక్స్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన కొన్ని ఏర్పాట్లను పూర్తి చేయగా మరొకవైపు కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతుందని తెలుస్తోంది.

ఇక ఈ సీజన్ లో కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉంటుందని తెలియడంతో ఈ కార్యక్రమం పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ లను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుందని తాజాగా నిర్వాహకులు ప్రోమో ద్వారా తెలియజేశారు.ఈ క్రమంలోనే సీజన్ సిక్స్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ సీజన్ కి నాగార్జున వ్యాఖ్యాతగా ఉండరు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ ప్రోమో ద్వారా నిర్వాహకులు ఆ వార్తలకు చెక్ పెట్టారు. ఈ ప్రోమోలో భాగంగా నాగార్జున సందడి చేయడంతో ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని క్లారిటీ వచ్చింది.ఇకపోతే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుందనే విషయం తెలియక పోయినప్పటికీ త్వరలోనే ప్రసారం అవుతుందని ఈ ప్రోమో ద్వారా నిర్వాహకులు ఈ ఈ కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు.

YouTube video player