మూడోసారి ప్రేమలో విఫలమైన బిగ్ బాస్ రన్నర్ అఖిల్ సార్థక్..?

బుల్లితెర మీద ప్రకారమైన టీవీ షోలలో బిగ్ బాస్ రియాల్టీ షోకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రియాలిటీ షోలో పాల్గొన్నవారు ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలను అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో అఖిల్ సార్థక్ కూడా ఒకరు. బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న అఖిల్ చివరి వరకు నిలిచి ఆ సీజన్ రన్నర్ గా నిలిచాడు. అంతే కాకుండా ఇటీవల ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో కూడా అఖిల్ పాల్గొన్నాడు. మొత్తానికి అఖిల్ సార్ధక్ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న అఖిల్ ఆ సమయంలో మోనాల్ గజ్జర్ తో లవ్ ట్రాక్ నడిపాడు. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వెళ్ళిన తర్వత కూడా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అంతేకాకుండా షార్ట్ ఫిల్మ్స్ లో కూడా కలిసి నటించారు. అయితే కొంత కాలం నుండి మోనాల్ పేరు వినిపించటం లేదు. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అఖిల్ తాజాగా తన లవ్ బ్రేకప్ అయ్యిందని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ మోనాల్ తో అఖిల్ లవ్ బ్రేకప్ అయ్యిందా? అని అనుమానపడుతున్నారు.

ఇదివరకే అఖిల్ రెండుసార్లు తన లవ్ బ్రేకప్ అయ్యిందని చెప్పాడు. మొదటి అమ్మాయి కుక్కల వెంట పడుతున్నానని బ్రేకప్ చెప్పిందని చెప్పాడు. ఇక రెండోసారి ప్రేమించిన అమ్మాయి క్యాస్ట్ వేరు అని బ్రేకప్ చెప్పిందని తెలియచేశాడు. ఇక ఇప్పుడు మూడోసారి కూడ అఖిల్ లవ్ బ్రేకప్ అయ్యిందని తాజాగా పోస్ట్ చేశాడు. ఈ మేరకు అభిమానులు అఖిల్ ని కొన్ని ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలోనే రిలేషన్ షిప్ మీద మీ అభిప్రాయం ఏంటి ? ఒక నెటిజన్ అడగ్గా.. బ్రేకప్ అయ్యింది అంటూ లవ్ బ్రేకప్ ఎమోజీలను అఖిల్ షేర్ చేశాడు . అయితే కొందరు నెటిజన్స్ మాత్రం ఎవరా? లక్కీ గర్ల్ అని కామెంట్స్ చేస్తున్నారు.