Rashmika: బుల్లితెరపై నటిగా కొనసాగుతున్న వారిలో నటి ప్రేరణ ఒకరు. ఈమె కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటి అనే విషయం మనకు తెలిసిందే. 2017 వ సంవత్సరంలో హర హర మహాదేవ అనే సీరియల్ ద్వారా కెరియర్ ప్రారంభించిన ప్రేరణ అనంతరం తెలుగులో కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరొక సక్సెస్ అందుకున్నారు.
ఈ సీరియల్ తెలుగులో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. అలాగే ఇస్మార్ట్ జోడిలో సీజన్ 3 లో ఏకంగా విన్నర్ గా నిలిచి మరింత గుర్తింపు పొందారు. ఇకపోతే ప్రేరణకు ఇండస్ట్రీలో నటి రష్మిక మంచి స్నేహితురాలు అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ప్రేరణ ఎక్కడ చెప్పలేదు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు ఇదే ప్రశ్న ఎదురైనది. రష్మిక మీ ఫ్రెండ్ అని ఎక్కడ ఎందుకు చెప్పడం లేదు అంటూ ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు ప్రేరణ సమాధానం చెబుతూ రష్మిక నేను చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మేమిద్దరం ఒకే రూమ్ లో ఉండే వాళ్ళం. ఇద్దరం కూడా ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నాం అయితే రష్మిక సినిమా అవకాశాలను అందుకునే స్టార్ హీరోయిన్గా ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉంది అలాంటి తన గురించి నేను మాట్లాడుతూ తన గుర్తింపును నేను కూడా పొందడం నాకు ఇష్టం ఉండదు అలా మాట్లాడటానికి కూడా నాకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అందుకే ఎక్కడ రష్మిక నా ఫ్రెండ్ అని చెప్పను అంటూ తెలిపారు.
ఇక బిగ్ బాస్ వేదికపై నాగార్జున గారు అడగడంతో నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను నాగార్జున గారికి ఎలా తెలుసో నాకు తెలియదు కానీ నాగార్జున గారు అడగడంతో చెప్పాను కానీ అక్కడ కూడా రష్మిక గురించి మాట్లాడుతూ నేను ఫాలోయింగ్ పొందటం ఇష్టం లేదు అందుకే మాట్లాడలేదని తెలిపారు. ఇలా రష్మిక గురించి ప్రేరణ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.