బిగ్ బాస్ నాన్ స్టాప్.. టాప్ 5 కంటెస్టెంట్ లు వీళ్లేనా?

ఓటిటి లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుంది. పోయిన వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఆశు రెడ్డి ఎలిమినేట్ అవ్వటంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బాబా భాస్కర్ మాస్టర్, నట్రాజ్ మాస్టర్, అరియానా, బిందు మాధవి, మిత్రశర్మ, శివ, అఖిల్, అనిల్
కొనసాగుతున్నారు. ఇప్పటికే బిగ్బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలే కు చేరువలో ఉంది. 8వ వారం లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బాబా భాస్కర్ మాస్టర్ రావటంతో టాప్ ఫైవ్ కి వెళ్దాము అనుకున్న హౌస్ మెట్స్ అంచనాలు తారుమారయ్యాయి. టాప్ 5 లో ఉంటామని ఆశపడిన వారూ ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు.

ప్రస్తుతం హౌజ్ లో ఉన్న వాళ్ళల్లో బిందు, బాబా భాస్కర్ ,మిత్ర , అఖిల్, శివ టాప్ 5 లో ఉండి ఫినాలేకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో నట్రాజ్ మాస్టర్, అనిల్, అరియానా డేంజర్ జోన్ లో ఉన్నారు. నిజానికి డేంజర్ జోన్ లో ఉండాల్సిన మిత్ర తన గేమ్ తో ప్రేక్షకులని ఆకట్టుకోవడంతో టాప్ 5 వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే ఈ సీజన్లో టాప్ 5 కాకుండ టాప్ 6 ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాబా భాస్కర్ మాస్టర్ వద్ద ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి నట్రాజ్ మాస్టర్ ని సేవ్ చేస్తే ఆయన కూడ ఫైనాలేకి వెళ్ళే అవకాశం ఉంటుంది.

ఈ వారంలో బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగితే అనిల్, అరియానా కచ్చితంగా ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మునుపటి సీజన్లో టాప్ 5 వరకు వెళ్లిన అరియానా ఈ సీజన్లో మాత్రం టాప్ 5 లో స్థానం దక్కించుకొలేదని ప్రేక్షకులు జోస్యం చెబుతున్నారు.