బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా గత వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కాగానే ఆయన ఎన్నో యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్న నటరాజ్ మాస్టర్ తన ఎలిమినేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో తనని ఎలా అయితే అందరూ కలిసి బయటికి పంపారో ఇక్కడ కూడా తనని ఉద్దేశపూర్వకంగానే బయటికి పంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక నన్ను బయటికి పంపిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని అందరినీ బయటకు లాగుతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇకపోతే బిందుమాధవి బిగ్ బాస్ హౌస్ లో తన కూతురు గురించి మాట్లాడటం వల్లే నేను కూడా తన తండ్రి ప్రస్తావన తీసుకు వచ్చానని అంతకు మించి నాకు వేరే దారి కనిపించలేదని ఆయన తెలిపారు. బిందుమాధవి ఇక్కడ కొన్ని సినిమాలలో నటించి చెన్నై వెళ్లి పోయారు. తిరిగి పెయిడ్ ఫాలోవర్స్ ను పెట్టుకొని గేమ్ ఆడుతున్నారు అంటూ రెచ్చిపోయారు.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు తాను ఎంతో నిజాయితీగా ఆడానని అయితే బయట ఫేక్ ఓట్లు వేయించుకొని కొందరు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారు అంటూ ఈయన తన ఎలిమినేషన్ గురించి ఆవేదన వ్యక్తం చేశారు. నా గురించి హౌస్ లో ఎవరు ఏం మాట్లాడారో వారందరికీ తప్పనిసరిగా కౌంటర్ ఇస్తానని, రివ్యూలు ఇచ్చి ఆ వీడియోలను యూ ట్యూబ్ లో పెడతాను. నా పోరాటం ఎప్పటికీ ఆగదు అంటూ ఈయన షాకింగ్ కామెంట్ చేశారు.