Bigg Boss Buzz: ఇంట్లో వారిద్దరిని ఆడిస్తున్నారు గనుక మీరే శకుని… రవి మీద ఫైర్ అయిన నటరాజ్..!

Bigg Boss Buzz: బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఏడు మంది కంటెస్టెంట్ లు చేరుకుని టైటిల్ కోసం ఒకరితో ఒకరు గట్టి పోటీ ఇస్తున్నారు. 11 వ వారంలో నటరాజ్ మాస్టర్ హౌజ్ నుండి ఎలిమినేట్ అవ్వగా..ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బాబా భాస్కర్, బిందు, అరియానా, మిత్రా, శివ, అఖిల్, అనిల్ ఫినాలే వరకూ చేరుకున్నారు. నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నాడు. ఇటీవల ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అయ్యింది.

బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్న నటరాజ్ మాస్టర్ షో లో రవి మీద ఫుల్ ఫైర్ అయ్యాడు. షో లోకి వచ్చి రాగానే నాకోసం ఎదురుచూస్తున్నావ్ కదా నువు అని రవి మీద కౌంటర్ వేసాడు. దీంతో రవి మాట్లాడుతూ.. నేనొక్కడినే కాదు అందరూ మీరూ వస్తారని చూస్తున్నారు అని సమధానం ఇచ్చాడు. ఈ షో లో ఇద్దరిమద్య సంభాషణ చాలా ఘాటుగా సాగింది. రవి మాట్లాడుతూ.. హౌజ్ లో తమిళ,తెలుగు అంటూ ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడరు అని అడగగా.. దానికి కూడ నేనూ క్లారిటీ ఇస్తాను అని నటరాజ్ మాష్టర్ సమధానం ఇచ్చాడు.

ఇక బిందూ గురించి మాట్లాడుతూ ఇంతటి క్రూరమైన అమ్మాయిని నేనూ ఎక్కడ చూడలేదు. ఆమే తీసే పాయింట్స్ చాలా దారుణంగా ఉంటాయి అని మాష్టర్ అనగా.. ఆమె అలా పాయింట్స్ తీసింది కాబట్టే నేనూ,ప్రేక్షకులు ఆమె హౌజ్ లో ఉండాలని ఓట్లు వేసాము అని రవి అంటాడు. నాకూ లైఫ్ లో అసలు ఒక సక్సెస్ కూడ రావటం లేదు అని నటరాజ్ అనటంతో.. టాలెంట్ కి హద్దులు లేవు మాష్టర్ అని రవి అంటాడు. ఇక ఒక అమ్మాయిని శకునితో పోల్చటం ఎంతవరకు కరెక్ట్ అని రవి అడగ్గా.. మహాభారతంలో శకుని అందరిని ఆడిస్తాడు. అలాగే హౌస్ లో వారిద్దరిని ఆడిస్తున్నావు గనుక నువే శకునివి అని అంటాడు. రవి ఇలా ప్రశ్నలు అడగటంతో మాట్లాడితే నీ మనసులో ఏదో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావు అని రవి మీద అయ్యాడు.