బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హిమజ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు పొందిన ఈమె బిగ్ బాస్ తర్వాత పలు సినిమా అవకాశాలను అందుకుంటు వరుస సినిమాలలో నటించడమే కాకుండా ఎన్నో బట్టలు నగల దుకాణాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా పాల్గొంటు బాగానే సంపాదిస్తున్నారు. ఇలా ఒకవైపు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా హిమజ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా నిత్యం తనకు సంబంధించిన విషయాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడమే కాకుండా నేటిజన్ లు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఆస్క్ మీ అనే సెషన్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది నెటిజన్లు వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ తన దగ్గర నుంచి సమాధానాలు రాబట్టారు. అయితే ఒక నెటిజన్ మాత్రం హిమజా పెళ్లి గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా నేటిజన్ ప్రశ్నిస్తూ .. హిమజక్క పెళ్లి ఎప్పుడు..పెళ్లి గురించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు హిమజ సమాధానం చెబుతూ.. ప్రస్తుతం తనకు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచనలు లేవని అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే తనకు లేదని తెలిపారు. తనకు పీస్ ఆఫ్ మైండ్ ఫ్రీడం కావాలని ఈమె పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఎంతో స్వేచ్ఛగా తనకు నచ్చినట్టుగా బతుకుతున్న హిమజ పెళ్లి తర్వాత అలాంటి స్వేచ్ఛకు దూరం అవుతారని భావించారేమో కానీ ఈమెకు మాత్రం ఫ్రీడమ్ కావాలంటూ పెళ్లంటే ఇంట్రెస్ట్ లేదని సమాధానం చెప్పారు. ప్రస్తుతం పెళ్లి గురించి ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.