Solo Boy: బిగ్ బాస్ గౌతమ్ సోలో బాయ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వారికీ ఇదే మా సమాధానం అంటూ!

Solo Boy: నవీన్ కుమార్ దర్శకత్వంలో బిగ్ బాస్ ఫ్రేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన చిత్రం సోలో బాయ్. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించిన విషయం తెలిసిందే. కాగా ఇందులో రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ ఇంకా పలువురు కీలక పాత్రల్లో నటించిన విషయం తేలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమా జులై 4వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా తాజాగా మూవీ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ ఈవెంట్ కి వివి వినాయక్, రఘు కుంచే, కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్ పలువురు గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఇంట్లో భాగంగా వివి వినాయక్ మాట్లాడుతూ.. నిర్మాత సతీష్ ఒక దర్శకునిగా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. చాలా సాధారణ స్థాయి నుండి ఈరోజు నిర్మాతగా మారడానికి ఎంతో కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు. ఈ సినిమాలో నటించిన గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. అనంతరం హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ కు వెళ్లక ముందు ఈ సినిమా మొదలైంది.

ఈ మూవీ నాకు అసలు ఫేమ్ లేని సమయంలో నన్ను నమ్మి సతీష్ గారు ఈ సినిమా మొదలు పెట్టారు. ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉండే ఎన్నో విషయాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. చిత్ర పరిశ్రమలో ఎటువంటి పరిచయాలు లేకుండా కేవలం బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి ఇలా ఒక సినిమాలో హీరోలా నిలబడటం అనేది చాలా పెద్ద విషయం. నేను దానిని ఒక సక్సెస్ లా చూస్తున్నాను. నన్ను ప్రశ్నించే వారికి ఇదే నా సమాధానం అని తెలిపారు గౌతమ్ కృష్ణ. ఈ సందర్భంగా గౌతమ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.