వ‌రుస‌ పెట్టి కాస్ట్ లీ కార్లు కొనుగోలు చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. ఏంటి సంగ‌తి?

విదేశాల‌లో మొద‌లైన బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ముందుగా మ‌న దేశంలో హిందీలో ప్రారంభ‌మైంది. స‌ల్మాన్ హోస్ట్‌గా రూపొందిన ఈ కార్య‌క్ర‌మానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. దీంతో మిగ‌తా ప్రాంతీయ భాష‌ల‌లోను బిగ్ బాస్ కార్య‌క్ర‌మాన్ని స‌జావుగా న‌డిపిస్తున్నారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ ఇలా ప‌లు భాష‌ల‌లో అల‌రిస్తున్న బిగ్ బాస్ షో తెలుగులో మాత్రం నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. తొలి సీజ‌న్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా రెండో సీజ‌న్‌కు నాని వ్యాఖ్యాత‌గా ఉన్నాడు. ఇక మూడు, నాలుగు సీజ‌న్స్‌ని నాగార్జున హోస్ట్ చేశారు. కంటెస్టెంట్స్‌గా ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లువురు న‌టీన‌టులు, సింగ‌ర్స్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతుండ‌గా, ఈ షోతో వారికి ద‌క్కుతున్న గుర్తింపు అంతా ఇంతా కాదు.

New Car | Telugu Rajyam

బిగ్ బాస్ షోకు వ‌చ్చి వెళ్లిన చాలా మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. ఈ షోకు ముందు పెద్ద‌గా గుర్తింపు లేని వారికి ఇప్పుడు అనేక ఆఫ‌ర్స్ కూడా త‌లుపుతుండ‌డం ఆనందాన్ని క‌లిగిస్తుంది. సీజ‌న్ 4తో సోహెల్‌, మెహ‌బూబ్, మోనాల్‌, అఖిల్‌, అరియానా వంటి వారు స్టార్ సెల‌బ్రిటీలుగా మారారు. అయితే సీజ‌న్ 3లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న అలీ రెజా మ‌ధ్య‌లో నిష్క్ర‌మించి మ‌ళ్ళీ రీఎంట్రీ ఇచ్చి అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. విన్న‌ర్ కాక‌పోయిన మంచి ఆద‌రాభిమానాలు ద‌క్కించుకున్నాడు. బిగ్ బాస్ షో త‌ర్వాత మ‌నోడి రేంజ్ ఎక్క‌డికో వెళ్లింది.

హ్యూమన్ బుల్డోజర్, బుల్లితెర అర్జున్ రెడ్డి, యాంగ్రీ యంగ్ మెన్ అంటూ ప‌లు ట్యాగ్‌ల‌ను తెచ్చుకున్న అలీ రెజా రీసెంట్‌గా నాగార్జున న‌టించి వైల్డ్ డాగ్ సినిమాలో ముఖ్య పాత్ర కూడా పోషించాడు. అలానే కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలోను న‌టిస్తున్నాడు. చేతినిండా ప‌లు ఆఫ‌ర్స్‌తో బిజీగా ఉన్న అలీ రెజాకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నిండుగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. దీంతో ఇటీవ‌ల ఓ అపార్ట్‌మెంట్ కొంటున్న‌ట్టు చెప్పుకొచ్చాడు. తాజాగా అలీ ఓ కొత్త కారును కొన్నాడు. ఆ కారులో తెగ షికార్లు కొడుతున్నాడు. తాజాగా ఆయ‌న షేర్ చేసిన కారు ఫొటో వైర‌ల్ అవుతుంది. ఆ మ‌ధ్య బిగ్ బాస్ ఫేం హిమ‌జ‌, శివ జ్యోతి కూడా కొత్త కార్లు కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంద‌రు ఇలా కార్లు కొన‌డాన్ని చూసి అభిమానులు ఆనందిస్తున్నారు . 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles