బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ ఇంట్లో తీవ్ర విషాదం.. దుఃఖంలో షణ్ముఖ్…!

షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన షణ్ముఖ్ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోస్, వెబ్ సెరిస్ ల తో బాగా పాపులర్ అయ్యాడు. తన పాపులారిటీ వల్ల బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. యూట్యూబ్ వీడియోస్ ద్వారా పాపులర్ అయిన షణ్ముఖ్ బిగ్ బాస్ వల్ల తన పాపులారిటీ మరింత పెరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో సిరితో హద్దులు మీరి ప్రవర్తించడం వల్ల ఐదు సంవత్సరాల తన ప్రేమని వదులుకోవల్సి వచ్చింది. సిరి, షణ్ముఖ్ మధ్య బిగ్ బాస్ హౌస్ లో జరిగిన సంఘటనల కారణంగా దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది.

అప్పటి నుండి కొంత డిప్రెషన్ లో ఉన్న షణ్ముఖ్ కి తాజాగా మరో చేదు వార్త ఎదురయ్యింది. తనకి ఎంతో ఇష్టమైన బామ్మ ఈరోజు కాలం చేసింది. ఈ విషయాన్ని షణ్ముఖ్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. తన బామ్మ చనిపోయిన విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ ఆమెతో షణ్ముఖ్ కి ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. దీప్తి దూరమయ్యిందన్న బాధ ఒకవైపు ఉంటే ఇప్పుడు తాజాగా తన బామ్మ మరణ వార్త కూడా షణ్ముఖ్ ని మరింత కలచివేస్తుంది.

ఇన్ స్టా గ్రామ్ లో షణ్ముఖ్ పోస్ట్ చూసిన వారు తన బామ్మకు సంతాపం తెలుపుతున్నారు. ఈ రోజు షణ్ముఖ్ బామ్మ మరణించటంతో వారి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక దీప్తి విషయానికి వస్తే ఇప్పటికీ షణ్ముఖ్ దీప్తిని కలుస్తానని గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇటీవల బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ గ్రాండ్ ఫినాలేలో పాల్గొన్న షణ్ముఖ్ దీప్తి విషయం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ ప్రశ్నలను దాటేయకుండ త్వరలోనే దీప్తిని కలుస్తానని చాలా నమ్మకంగా చెప్పాడు.