Ariyana Glory: బిగ్ బాస్ కంటెస్టెంట్ లు అందరూ ఒకే చోట చేరితే వారు చేసే హంగామా మాటల్లో చెప్పలేము. ఇలా వీరందరూ కలిసి ఎంతో హడావిడిగా సందడి చేస్తుంటారు. ఇప్పటి వరకు 5 సీజన్ లు పూర్తికావడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరూ కలిసి బిగ్ బాస్ ఉత్సవం పేరిట మరొక కార్యక్రమం ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరు సందడి చేయబోతున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలలో భాగంగా సింగర్ గీతామాధురి హాజరయ్యారు.
ఇక గీతా మాధురిని మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆరియానా కొన్ని ప్రశ్నలు వేశారు. మీ బుగ్గలు చాలా లావు అయ్యాయి కారణం ఏంటి అని గీతా మాధురిని ప్రశ్నించడంతో గీతా మాధురి గత ఐదు రోజులుగా బాగా నిద్రపోతున్నాను అందుకే బుగ్గలు ఉబ్బి పోయాయని సమాధానం చెప్పారు. అంతేనా ఇంకా ఏమైనా గుడ్ న్యూస్ ఉందా అంటూ ఇన్ డైరెక్ట్ గా తన ప్రెగ్నెన్సీ గురించి ఆరీయానా అడిగారు. దీంతో గీతామాధురి ఛీ..ఛీ అలాంటిదేమీ లేదు. ఒకవేళ ఉంటే నేనే చెప్తాను అంటూ సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా గీతా మాధురి మాట్లాడుతూ ఏ క్షణానైనా ఏమైనా జరగచ్చు అంటూ సమాధానం చెప్పడంతో ఆ క్షణానికి ముందుగా కంగ్రాట్స్ అంటూ
ఆరీయానా గీతా మాధురికి శుభాకాంక్షలు చెప్పారు. అలాంటి గుడ్ న్యూస్ ఏమైనా ఉంటే నేనే చెప్తాను అయితే ఆరు లేదా ఏడవ నెలలో మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అంటూ తను మరోసారి తల్లి కావడానికి ప్లాన్ చేశారనే విషయాన్ని ఈ సందర్భంగా గీతామాధురి బయటపెట్టారు.